సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో అన్ని కూరగాయలు ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు చౌకైన, పౌష్టికా విలువలు ఉన్న మాంసాహారంగా భావించే చికెన్ తో పాటు కోడి గుడ్డు ధరలు ఇటీవల సామాన్యుడికి అదనపు భారంగా మారాయి. గత నెల రోజులుగా కోళ్ల పౌల్ట్రీలు ఎక్కువగా ఉండే పశ్చిమ గోదావరి , తూర్పు గోదావరి జిల్లాలోనూ కోళ్ల ఫారాల వద్దే ఒక్కో కోడి గుడ్డు రూ. 6.95 పైసలతో రికార్డు స్థాయికి చేరుకుంది. ఇక హోల్ సేల్ వ్యాపారుల వద్ద 30 గుడ్ల హోల్ సేల్ ధ్ర 220 రూపాయలకు చేరిపోయింది. 2 నెలల క్రితం వరకు 170 రూపాయల లోపే ఈ ధర ఉండేది. ఇప్పటి వరకు ఇదే అత్యధిక రికార్డు ధర కావడం విశేషం. ఒక కోడి గుడ్డు ధర రిటైల్ మార్కెట్‌లో రూ. 8.50 పైసలకు పైగానే పలుకుతుంది. గతేడాది ఇదే రోజున రూ. 5 రూపాయలు ఉండగా ఇప్పుడు డబుల్ అయింది.ఇక స్కిన్ లెస్ చికెన్ ధర కూడా కేజీ 340 -350 రూపాయలకు చేరుకొంది. 2 క్రితం కేవలం 230 రూపాయలకు అందుబాటులో ఉండేది. ఇటీవల వాతావరణ మార్పులతో వర్షాలు పడకపోవడంతో పౌల్ట్రీ లలో కోళ్లు విపరీతంగా చనిపోవడం ఉన్నవి గుడ్డులు పెట్టలేకపోవడం వల్ల ఈ రేట్లు పెరిగాయని పౌల్ట్రీ యజమానులు అంటున్నారు.
