సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖ జిల్లాలో నేడు, ఆదివారం ఉదయం ముందుగా వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేయబోయి అదే లాారీని ఢీకొట్టిన ఘటననలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులంతా పల్నాడు జిల్లాకు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. శ్రీకాకుళంలో ఓ వివాహ కార్యక్రమానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే . ఈ ప్రమాదంలో ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. తీవ్ర గాయాలతో ఉన్న ఆ వ్యక్తి ప్రస్తుతం భీమిలి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *