సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఆకివీడు రామాలయం పునరుద్ధరణ ఘటనలో జరిగిన పరిణామాలు..రామాలయ నిర్మాణం ఆపాలని జడ శ్రవణ్ కుమార్ సుప్రీం కోర్ట్ వరకు వెళ్లిన నేపథ్యం.. దళిత క్రైస్తవులతో ఏర్పడిన విభేదాలు ..అపోహలు నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకు ప్రముఖ నాయ్యవాది, జడ్జి ‘జై భీమ్ రావ్ భారత్ పార్టీ’ అధ్యక్షుడు, జడ శ్రావణ్ కుమార్ కు మధ్య మీడియాలో మాటామాటా పెరిగి రఘురామా ఆయనను ఇటీవల ‘నీలి’ కుమారుడు ,’లిల్లీ ఫుట్‘ అని సంబోదించడంతో.. జడ శ్రావణ్. దానికి ప్రతిగా బహిరంగ వేదికగా రఘురామా ను వ్యక్తిగత దుర్భాషణాలు చేస్తూ రఘురామా నాలుక కోసి పిఠాపురం పవన్ కళ్యాణ్ కు పంపుతామని హెచ్చరించడం, రఘురామాకు సూటు కుట్టించాలంటే భీమవరంలో బట్టల షాపులలో గుడ్డ సరిపోదని ఎద్దేవా చెయ్యడం దళిత క్రైస్తవులు చర్చ్ లపై మైక్ లు ఎవరు తియ్యవద్దని కేసులు పెడితే తాను చూసుకొంటానని భరోసా ఇచ్చిన నేపథ్యంలో.. రఘురామా ను నేరపూరిత బెదిరింపులకు పాల్పడటంతో పాటు మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా జడ శ్రవణ్ కుమార్ వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలుతో కాళ్ల మండలం సీసలి గ్రామానికి చెందిన తోట ఫణిబాబు.. శ్రావణ్ కుమార్‌పై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కాళ్ల పోలీసుస్టేషన్‌లో శ్రావణ్ కుమార్‌పై ఈ కేసు నమోదైంది. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. అవసరమైతే సంబంధిత వ్యక్తులను విచారణకు పిలిచే అవకాశం ఉంది.
