సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇజ్రాయిల్ లెబనాన్ ఫై దాడులు ఆపని పక్షంలో ఒప్పందం రద్దు అవుతుందని ఇరాన్ హెచ్చరించి హర్ముజ్ ను మరోసారి మూసివేసింది. వెంటనే అమెరికా ప్రసిడెంట్ ట్రంప్ ఒప్పందం నియమాలు పాటించకపోతే ఇరాన్ ను లేకుండా చేస్తానని హెచ్చరించడం తో .. అయితే చూసుకొందాం .. అంటూ ఇరాన్ హర్ముజ్ ను మరోసారి మూసివేసింది. ట్రంప్ కి ఎప్పుడు ఏమి మాట్లాడాలో తెలియదా?హోర్ముజ్ బంద్కు ట్రంపే కారణం: జర్మనీ మండిపడింది. ఈ ఉద్రిక్తత పరిస్థితులలో గత ఆదివారం ఇరాన్-అమెరికా మధ్య స్విట్జర్లాండ్లో చర్చలు ప్రారంభమయ్యాయి. తాజా చర్చల్లో అమెరికా ప్రతినిధి బృందానికి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నాయకత్వం వహించగా, ఇరాన్ బృందానికి ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ నేతృత్వం వహించారు. ఈ చర్చలు ఎడమొహం పెడమొహంగానే మొదలయ్యాయని సమాచారం. చర్చలకు ముందు అమెరికా ప్రతినిధులతో కరచాలనం చేసేందుకు, గ్రూప్ ఫొటో దిగేందుకు ఇరాన్ ప్రతినిధులు ఒప్పుకోలేదని అల్జజీరా వార్తా సంస్థ పేర్కొంది. ఈ చర్చల్లో ఇరాన్ ప్రతినిధులు నిరసన వ్యక్తంచేస్తూ వాకౌట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు ఇరాన్ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఆ దేశ పార్లమెంటు స్పీకర్ గలిభాఫ్ హెచ్చరించారు. అయితే, ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన జేడీ వాన్స్.. చర్చలు ఫలవంతంగా సాగాయని చెప్పారు.
