సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇక ప్రపంచ వ్యాప్తంగా సాంకేతికరంగం కొత్త యుగం లోకి .అంటే A I లోకి ప్రవేశించింది. అన్ని రంగాలలోకి ఐ విస్తరిస్తుంది. ఈ నేపథ్యంలో భారత్ లో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) తన వ్యాపార సామ్రాజ్యాన్ని A I లోకిమరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే ఏడేళ్లలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నట్టు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆర్ఐఎల్ పోస్టు చేసింది. ‘ఇప్పటికే ఇంధనం, డిజిటల్ సేవలు, రిటైల్, మీడియా, హరిత ఇంధన టెక్నాలజీ రంగాల్లో ప్రపంచంలోనే మేటి కంపెనీగా ఎదిగింది. ఇప్పుడు కొత్తగా రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులతో అత్యధిక గిగావాట్ల సామర్థ్యం ఉండే ఏఐ ఆధారిత డేటా కేంద్రాల ఏర్పాటుకు సిద్ధమవుతున్నాం’ అని రిలయన్స్ ఆ పోస్టులో పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచంలో అనేక దిగ్గజ కంపెనీలు చైనా ప్లస్ వన్ అనే వ్యూహాంలో భాగంగా తమ ఏఐ ఆధారిత డేటా కేంద్రాలను భారత్లో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. తన భారీ డేటా కేంద్రాన్ని వైజాగ్లో అదానీ సహకారంతో ఏర్పాటు చేస్తున్నట్టు గూగుల్ ఇప్పటికే ప్రకటించింది.
