సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి మంగళవారం ఉదయం లాభాల్లో కొనసాగిన దేశీయ సూచీలు మధ్యాహ్నం తర్వాత నష్టాలలోకి దిగిపోయాయి. . డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ (96.52) రికార్డు స్థాయిలో పడిపోయింది. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు కూడా సూచీలను వెనక్కి లాగాయి. గత సెషన్ స్వల్ప నష్టాల ముగింపు (75,315)తో పోల్చుకుంటే నేడు మంగళవారం ఉదయం 100 పాయింట్లకు పైగా లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత పైకి వెళ్లింది. అయితే మధ్యాహ్నం పడిపోయింది.ఇంట్రాడే గరిష్ఠంతో పోల్చుకుంటే సెన్సెక్స్ 600 పాయింట్లు కిందకు వచ్చింది. చివరకు సెన్సెక్స్ 114 పాయింట్ల నష్టంతో 75,200 వద్ద ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా చివరకు 31 పాయింట్ల నష్టంతో 23,618 వద్ద రోజు ముగించింది. (stock market ).బ్యాంక్ నిఫ్టీ 127 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ మాత్రం 548 పాయింట్లు లాభపడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *