సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా వాణిజ్య ఎల్‌పీజీ గ్యాస్సిలిండర్ల ధరలు మరోసారి పెరిగాయి (LPG ). దీనితో హోటల్స్ తదితర తినుబండారాలు టీ షాపుల నిర్వహణ భారం పెరిగి వినియోగదారులపై మరింత వడ్డన పడనుంది.నేడు సోమవారం (జూన్ 1) నుంచి వాణిజ్య సిలిండర్ల ధరలను పెంచుతున్నట్టు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్‌పై ఢిల్లీలో రూ.42 పెంచుతున్నట్టు పేర్కొన్నాయి. దీంతో ఢిల్లీలో ఒక్కో సిలిండర్ ధర రూ. 3,113.5కు చేరింది (LPG Cylinder Price Today).ఈ పెంపు కారణంగా హైదరాబాద్‌లో 19 కిలోల కమర్షియల్ సిలిండర్‌ ధర రూ.3294కు చేరుకుంది. అలాగే చెన్నైలో రూ.3232కు చేరింది. ఇక, ఐదు కేజీల ఫ్రీట్రేడ్ ఎల్పీజీ సిలిండర్లపై రూ.11 చొప్పున పెంచారు. కాగా, గృహ వినియోగ సిలిండర్ల ధరల్లో మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి మార్పులూ లేవు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *