సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ప్రచండంగా మండి పోతున్నాయి. ప్రజలు తీవ్రమైన ఉక్కపోత, వేడితో అల్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 42-45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి..నేటి ఆదివారం నుండి మరింత ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ ముందుగా ప్రకటించినప్పటికీ ఊహించని విధంగా ద్రోణి ఏర్పడటంతో రేపు సోమవారం నుండి 4 రోజులు పాటు తెలుగు రాష్ట్రాలలో పలు ప్రాంతాలలో ఉరుములు పిడుగులతో,వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజగా వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.ఈ తరుణంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ద్రోణి, ప్రభావం దక్షిణ – నైరుతి దిశగ గాలుల ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ద్రోణి సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి కొనసాగుతోంది. దీంతో ఏపీలో ఉత్తర కోస్తాలో ,పశ్చిమ గోదావరి జిల్లాలో నేటి ఆదివారం సాయంత్రం నుండి , సోమవారం, మంగళవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు – బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్లు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది. రాయలసీమలో చిరు జల్లులు పడే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *