సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం నందు భక్తుల కు సర్వ శుభప్రదం కావాలని నేడు, సోమవారం అమావాస్య సందర్భంగా ఆలయ అర్చకులు మరియు వేదపండితులు చండీహోమం కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 89 మంది దంపతులు ఈ హోమంలో పాల్గొన్నారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలిపారు..ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు వుదీశి మీనాక్షి, గుసిడి నాగ శిరీష, కారెంపూడి ఆదిలక్ష్మి, గొంతిన రమణ, యండ సత్యవతి పాల్గొన్నారు
