సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్ భీమవరం సమీపంలోని కాళ్ళకూరు గ్రామంలో స్వయం భువుడుగా వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానము ఆవరణ విస్తరణకు జరుగుచున్న అభివృద్ధి పనులలో భాగంగా దేవాలయం చుట్టూ మాడవీధులు విస్తరణలో భాగంగా స్థలం కొనుగోలు నిమిత్తం భక్తులు విశేషంగా విరాళాలు ఇస్తున్న నేపథ్యంలో నేడు, సోమవారం కాళ్ళకూరు వాస్తవ్యలు కీ.శే. కొమ్మూరి వెంకట నరసింహారావు (నరసింహా బాబు) గారి జ్ఞాపకార్ధము బార్య శ్రీమతి సత్యవతి కుమార్తెలు అక్షింతలు ప్రసన్న , భర్త నాగ మంగేష్ మరియు పచ్చిగోళ్ళ హిమబిందు భర్త కాశి విశ్వనాద్ రూ. 1,01,116/- ( అక్షరాల ఒక్క లక్ష ఒక్క వెయ్యి నూట పదహారు రూపాయిలు)దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం అరుణ్ కుమార్ మరియు ధర్మ కర్తల మండలి సభ్యులు మరియు అధ్యక్షులు అడ్డాల.శివరామరాజు , గ్రామ పెద్దలు సమక్షమున అందజేయడం జరిగినది. దాతలను అభినందించి వారికి స్వామి వారి శేష వస్త్రం ప్రసాదములు, వేద ఆశీర్వచము అందించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *