సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రతి రోజు అప్రతిహతంగా రోడ్డు ప్రమాదాలు, భారీ సంఖ్యలో మరణాలు ప్రయాణికులకు భయకంపితులను చేస్తూనే ఉన్నాయి. కర్నూల్ జిల్లాలో నేడు, గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద బొలెరో వాహనం-లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ఉన్న 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. మృతులు అమృత, తేజస్వని, ధన్య, దీపక్, దీక్షిత, ప్రతాప్, కుమార్‌గా గుర్తించారు. వీరంతా కర్నాటక రాష్ట్రం చిక్‌మంగళూరు జిల్లా కనకాయహల్లి గ్రామానికి చెందినవారని, అధికారులు గుర్తించారు. మంత్రాలయం పుణ్యక్షేత్రం సందర్శనకు వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరగడం బాధితుల కుటుంబాల్లో తీరని విషాదం నింపింది.
