సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్ : నేడు, శుక్రవారం భీమవరం పట్టణ శివారు చినమీరం గ్రామంలో కోదండ రామాలయ పునః నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. చిన అమిరం కొత్తపేట శ్రీరామాలయం పునః నిర్మాణానికి భక్తులు దాతల సహకారంతోపాటు శ్రీవాణి ట్రస్టు నిధులు వినియోగిస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణం, అభివృద్ధికి టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీవాణి ట్రస్ట్ నిధులు మంజూరు చేస్తుందన్నారు. త్వరలోనే శ్రీరామాలయం పునః నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. కార్యక్రమంలో బుద్దరాజు శ్రీనివాస రాజు, కోళ్ల నాగేశ్వరరావు, కమిటి అధ్యక్షులు మహేష్, ఉపాధ్యక్షులు భోగి శ్రీనివాస్, దేవర అప్పారావు, బోగి రామారావు, బోగి సురేష్, బొంతల శ్రీను గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
