సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం గోపి చాంద్ దర్శకత్వంలో సినిమా షూటింగ్‌లో ఫైట్ సన్నివేశంలో క్రింద పడి కాలి మోచిప్ప కు గాయపడిన హీరో , టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను సీఎం చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించారు. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే బాలకృష్ణకు సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ ఖాతా వేదికగా పోస్ట్ చేశారు.నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. వారి అచంచలమైన సంకల్పబలం దృష్ట్యా, వారు అతి త్వరలోనే తిరిగి పనిలో నిమగ్నమవుతారని నాకు నమ్మకం ఉంది! త్వరగా కోలుకోండి!’ అని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *