సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలం దొంగపిండి గ్రామానికి చెందిన రేవు జనార్దన్ కు రూ 4 లక్షల 30 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును నేడు, మంగళవారం భీమవరం టిడిపి కార్యాలయంలో ఇంచార్జి, తోట సీతారామ లక్ష్మి అందించారు. ఆమె మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న సామాన్యులకు సీఎం చంద్రబాబు సీఎం రిలీఫ్ పండ్ అందించి ఆడుకొంటున్నారని .. అవినీతికి, దళారుల ప్రమేయానికి తావు లేకుండా లబ్ధిదారులకు నేరుగా సాయం అందేలా రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ దరఖాస్తుల ప్రక్రియను పూర్తిగా ఆన్ లైన్ చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు.
