సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణాలో వాడవాడలా బోనాలు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే తెలుగునాట ప్రసిద్ధి చెందిన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలులో ముగింపు నేపథ్యంలో నిన్న, నేడు అమ్మవారిని దర్శించుకుకోవటానికి భక్తులు భారీగా ఆలయానికి తరలి వచ్చారు. ఈ ఉత్సవాల సందర్భంగా నేడు సోమవారం శ్రీ అమ్మవారి ప్రతిరూపంగా భావించే మాతంగి స్వర్ణలత (Matangi Swarnalatha) మొదట కాస్త మౌనం దాల్చినప్పటికీ భవిష్యవాణిని వినిపించారు. పలు అంశాల గురించి ఆమె భవిష్యవాణి వినిపించారు. మీకు భవిషత్తు ఎందుకు చెప్పాలి? నేను సంతోషంగా రాలేదు, క్రోధంగా వచ్చా, నా మాటలు ఆచరించనప్పుడు ఎందుకు సమాధానాలు చెప్పాలి., రెండు మాసాలు అయిపోయాయి, విగ్రహ ప్రతిష్ఠ చేయడం లేదు. నా ఆగ్రహానికి గురవుతున్నారు.. ఈసారి ఎవరు అడ్డుపుల్ల వేసిన తొలగిస్తా, ఎవరు అడ్డొచ్చిన తీసుకుపోతా.నేను ఊరుకోను, విగ్రహ ప్రతిష్ఠ చేయాలి.గత ఏడాది చెప్పినట్లుగా ఈ ఏడాది కుంభవర్షాలు ఉన్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. అగ్నిప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. సగానికి సగం కొట్టుకుపోతారు. ఈ ఏడాది ఎక్కువగా ప్రాణానష్టాలు ఉంటాయి. వావివరుసలు లేకుండా జనాలు ప్రవర్తిస్తారు.తల్లిదంద్రులు పిల్లల ను ఊరిమీద వదిలేస్తున్నారు. నాకు సంతోషం లేకుండా చేస్తున్నారు.ఈ ఏడు నేను మాట్లాడేది చాలా ఉంది. అని మాతంగి స్వర్ణలత చెప్పారు.
