సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం డిఎన్నార్ కళాశాల రోడ్డులోని నర్సింగ్ హోమ్ లో నేడు, బుధవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 2వ బ్యాచ్ 50 మందికి మొదటి విడత హెచ్ పివీ వాక్సినేషన్ వేసే కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ఇటీవల కాలంలో సుమారు 40 శాతం మహిళలలో గర్భాశయ ముఖ క్యాన్సర్లు వస్తున్నాయని, క్యాన్సర్ నివారణలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని క్యాన్సర్లను రాకుండా నిరోధించడానికి నేడు జరుగుతున్న ప్రయత్నాలలో భాగంగా మహిళలలో గర్భాశయ ముఖ క్యాన్సర్ (సర్వికల్ క్యాన్సర్) రాకుండా ఉండడానికి హెచ్ పివి వ్యాక్సిన్ ను 2030 నాటికి అందరికీ చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పించాయన్నారు. 15 సం రాలు వయసు పైబడిన వారికి మన జిల్లాలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాక్సినేషన్ చేస్తారన్నారు. ఈ వ్యాక్సినేషన్లో ముందుగా వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు బూస్టర్ డోసు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు బొండా రాంబాబు, మాట్లాడుతూ.. మా క్లబ్ ద్వారా 300 మందికి వ్యాక్సిన్ చేయిస్తామని, ఇది ప్రైవేట్ గా వేయించుకుంటే ఒక్కొక్కరికి రూ 12,000 లు అవుతుందని అలాంటిది మేము ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు.లయన్ డా అనుపమ,లయన్ డా కొంపెల్ల గోపినాథ్ మాట్లాడుతూ ..క్యాన్సర్ మహమ్మారిని తరిమి కొట్టడానికి సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *