సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదరబోతోందని, హోర్ముజ్‌లో ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేడు, బుధవారం ప్రకటించడం భారతీయ సూచీలకు ఊతంగా మారింది. అలాగే డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి కోలుకోవడం జరిగింది. గత సెషన్ ముగింపు (77,017)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం దాదాపు 400 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత పైకి వెళ్లింది. నేటి సాయంత్త్రం ముగింపు సమయానికి సెన్సెక్స్ 940 పాయింట్ల లాభంతో 77,958 ముగిసింది.. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతం 298 పాయింట్ల లాభంతో 24,330 వద్ద ముగిసింది. (stock market news today).సెన్సెక్స్, నిఫ్టీలో కోఫోర్జ్, ఫోర్స్ మోటార్స్, ఎస్‌ఆర్‌ఎఫ్, యెస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్ మొదలైన షేర్లుమంచి లాభాల్లో ఉన్నాయి
