సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్;ఇటీవల వేసవిలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి స్వంత నియోజకవర్గం పాలకొల్లు పట్టణంలో ప్రజలకు తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడిన విషయం తన దృష్టికి రావడంతో స్థానిక మునిసిపల్ అధికారులపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ముందస్తుగా ప్రత్యామ్నాయ చర్యలు ఎందుకు తీసుకోలేదని అధికారులపై ఆయన మండిపడ్డారు. నేడు, ఆదివారం ఉదయం నుండి మంత్రి నిమ్మల తనదయిన శైలిలో,, మున్సిపల్ వాటర్ వర్క్స్‌కు వెళ్లి తాగునీటి చెరువుల్లో నీటి పరిమాణాన్ని చాల తక్కువగా ఉండటం ముందే చూసి వచ్చారు.. రానున్న రోజుల్లో ప్రజలకు తాగు నీటి అవసరాలు తీర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని , యుద్ధ ప్రాతిపదికన పలు చోట్ల బోరు బావి తవ్వకాలు చేయాలని అధికారులకు మంత్రి నిమ్మల స్పష్టం చేశారు.
