సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంటింటి ఓటర్ల సర్వే నేటి సోమవారం తో పూర్తీ చేసి జాబితా వివరాలను కలెక్టరేట్ లో సమర్పించి ఆన్ లైన్ లో పెట్టవలసి ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి గత 2 రోజులుగా జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఆకస్మికంగా వెళ్లి అధికారుల సర్వే తీరును పరిశీలించి తగు ఆదేశాలు సూచనలు ఇచ్చారు. దీనిలో భాగంగా నేడు, మరోమారు జిల్లా అధికారులతో కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ.. ‘మనకు ఈ ఒక్క రోజు మాత్రమే గడువు ఉంది. వివాదాలకు తావు లేకుండా ఇంటింటి ఓటర్ల సర్వే జాబితాను నూటికి నూరు శాతం పూర్తిచేయాలి. సర్వేలో ఎలాంటి అనుమానాలు తలెత్తినా తహసీల్దార్ లు దృష్టికి తీసుకెళ్లి వాటిని నివృత్తి చేసుకుని, ఎలాంటి లోపాలు లేకుండా సమగ్రంగా ఆన్‌లైన్‌ను పూర్తి చేయాలని ఆదేశించారు. బీఎల్‌వోల వెంట వలంటీర్లు, ఇతర వ్యక్తులను తీసుకుని వెళ్ళకూడదన్నారు. నేటి సోమవారం రాత్రిలోగా ఆన్‌లైన్ చేయాలి’ అని ఆదేశాలు జారీ చేశారు
