సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చంద్రబాబు తనయుడు మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన టీడీపీ- యువగళం పాదయాత్ర కృష్ణ జిల్లా మీదుగా ఈ నెల 24న ఏలూరు జిల్లాలో సాయం త్రం 5 గంటలకు నూజివీడు మండలం లోని మీర్జాపురం లో ప్రవేశించనుంది. ఈ నేపథ్యంలో యాత్రకు సంబంధించిన మొదటి 4 రోజుల షెడ్యూల్, రూట్ మ్యాప్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు ప్రకటించారు. మీర్జాపురంలో నారాలోకేష్ కు ఘనస్వాగతానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నాయకుల ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటగా నూజివీడు నియోజకవర్గ పరిధిలోనే మూడు రోజుల పాటు 45 కిమీ మేర యాత్ర చేయనున్నారు. జిల్లాలో పార్టీ కి పునర్వవైభవం తేవాలన్న లక్ష్యంతో.. ఉమ్మడి పశ్చిమలో 25 నుంచి నెల రోజుల పాటు యాత్ర సాగనుంది. టీడీపీ నేతలు తమ నియోజకవర్గాల పరిధిలో సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. ఇదే సమయంలో పార్టీలో ఒక వర్గం అసంతృప్తి నేపథ్యంలో.. సుదీర్ఘ కాలంగా భీమవరం వేదికగా జిల్లాలో పార్టీ కార్యకలాపాలు నిర్దేశిస్తున్న మాజీ మునిసిపల్ చైర్మెన్, మాజీ రాజ్యసభ సభ్యురాలు.. పశ్చిమ గోదావరి టీడీపీ అధ్యక్షురాలు, తోట సీతారామ లక్ష్మి పదవి కూడా కేంద్ర స్థాయికి మారుతుందని కొత్త అడ్జక్షుడి ని ఎన్నుకొనే అవకాశం ఉందని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు.
