సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒక ప్యూహం ప్రకారం టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులను ఎంపిక చేస్తే అధికార వైసిపి కి ప్రజలలో ఉన్న కొంత వ్యతిరేకత ను అధికారానికి మెట్లు గా మార్చుకోవచ్చునని రాజకీయ విశ్లేషకుల అంచనా ఒకవైపు.. అయితే తాజగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చుసిన ఇదే చర్చ.. బీజేపీ తో పొత్తు అంటూ సాగదీసి, సాగదీసి ..ఢిల్లీ పెద్దలు వీరికి అటూయిటూ తేల్చకపోవడంతో ఎట్టకేలకు ..అందని ద్రాక్ష కోసం ఎగిరి ఒడిలో ఉన్న పళ్ళు నేలపాలు చేసిన చందాన.. గత శనివారం టీడీపీ జనసేన అభ్యర్థుల మొదటి లిస్ట్ విడుదల చేసినపప్పటి నుండి పలు ప్రాంతాలలో అటు టీడీపీ నేతలు, ఇటు జనసేన పార్టీ నేతలలో ఒక్కసారిగా అసమ్మతి భగ్గున మండింది. వారి కోపం రక రకాలుగా ప్రదర్శిస్తున్నారు. కొన్ని చోట్ల పార్టీ జెండాలు, ఫర్నిచర్ దహనాలు, నిరసనలు, తమకు చావే గతి.. అంటూ సొమ్మసిల్లి పడిపోవడం, క్యాడర్ ముఖం మీదే ఎంత తిడుతున్న చేసేది లేక తిట్టుంచుకొంటున్న స్థానిక నేతలు.. ఎక్కడ చుసిన గందర గోళం .. ఎక్కడ అభ్యర్థుల లిస్ట్ వచ్చిన సంతోషం.. సందడి నేతలలో కనపడలేదు.. ఇదేదో గోదావరి జిల్లాలలో జనసేన నేతలకే పరిమితం కాలేదు.. టీడీపీ అభ్యర్థులు ప్రకటించిన మిగతా ప్రాంతాలలో కూడా ఇదే ధోరణీ.. ఈ అసంతృపులను ఎలా హ్యాండిల్ చెయ్యాలో అర్ధం కాక ఎంపికైన అభ్యర్థులు ఎన్నికలకు సమయం తక్కువ ఉండటంతో ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు అధికార వైసీపీ నేతలు వేస్తున్న దారుణమైన సైటైర్లు.. ఇలా ఉంది పరిస్థితి..
