సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: సత్య సాయి జిల్లా ,కదిరి రూరల్ మండలం కుమ్మరవాండ్లపల్లి గ్రామంలోని నేడు, బుధవారం మధ్యాహ్నం ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్లు పేలాయి. అక్కడే జిలెన్ స్టిక్స్ కూడా ఉండటంతో ప్రమాదం తీవ్రత మరింత పెరిగింది.ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా .మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. గ్యాస్ మంటలు చుట్టు పక్కల ఇళ్లకు వ్యాపించడంతో భారీ ప్రమాదం జరిగింది. . ఫైర్ సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో గాయపడిన వారిని వెంటనే కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది.గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు . మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
