సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణానికి 11 కిమీ దూరంలో కాళ్ళ మండలంలో… పురాణాల ఆధారంగా 450 ఏళ్ళ క్రితం శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయం భువుడుగా వెలసిన కాళ్ళకూరు గ్రామం లో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి కల్యాణ మహోత్సవాలు ఈనెల 25 వ తేదీ శనివారం నుండి ప్రారంభం అవుతున్నాయని వచ్చే మే నెల 3వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు దేవాలయ కార్యనిర్వహణాధికారి, ఎం అరుణ్ కుమార్ తెలిపారు. శ్రీ స్వామివారి కల్యాణోత్సవాలలో శ్రీవారికి దేవేరులతో కళ్యాణం అంగరంగ వైభవం గా నిర్వహిస్తామన్నారు. ఈ కల్యాణోత్సవాలలో స్థానిక ఎమ్మెల్యే , రాష్ట్ర అసెంబ్లీ ఉప సభాపతి, రఘురామా కృషంరాజు పాల్గొంటారు. గోదావరి జిల్లాల నుండి వచ్చే వేలాది భక్తులకు ఇబ్బంది లేకుండా తగు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకలలో హైలైట్ గా నిలిచే శ్రీ దేవేరులతో శ్రీవారి 30 అడుగుల రధోత్సవం మే నెల 1 వ తేదీన మధ్యాహ్నం నిర్వహిస్తున్నారు. వేడుకలకు ముగింపుగా వేలాది భక్తులు పాల్గొనే అన్నసమారాధన మే 8వ తేదీన నిర్వహించనున్నారు. దేవాలయ ఆవరణలో చలువ పందిళ్ళలలో ప్రత్యేక సాంప్రదాయ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. కాళ్ల పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పట్లు చేస్తున్నారు.
