సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా చింతలపురిలో సునీల్ కుమార్ IPS తండ్రి పాతాళ గంగరాజు ఇటీవల మరణించిననేపథ్యంలో నేటి ఉదయం చింతలపూడి లో జరిగిన సంతాప సభలో రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు, మాజీ MBC చైర్మన్ పెండ్ర వీరన్న పాల్గొని గంగరాజు గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు . వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. వారితో పాటు భీమవరం అసెంబ్లీ వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్ చినిమిల్లి వెంకట రాయుడు సోదరుడు రిటైర్డ్ PD చినిమిల్లి VV నాయుడు మరణించినందున మరియు భీమవరం మాజీ కౌన్సిలర్ బాల మస్తానయ్య తండ్రి మరణించినందున.. శాసన మండలి చైర్మన్, కొయ్యే మోషేను రాజు వారి కుమారుడుకొయ్యే సుందర్ రాజు భీమవరం లోని వారి గృహాలకు వెళ్లి వారి పార్థివ దేహం వద్ద నివాళులు అర్పించారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.
