సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్: నేడు, శనివారం ది. 25-04-2026 వ తేదిన ప్రపంచ మలేరియా దినోత్సవం కార్యక్రమంను నేపథ్యంలో భీమవరం పట్టణంలో ప్రజా చైతన్య ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ జి.గీతాబాయి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి వారి అద్వర్యమున మరియు జిల్లా మలేరియ అధికారి (ఇంచార్జీ) డాక్టర్ వి.క్రాంతి కుమార్ ద్వారా ఈ కార్యక్రమం భీమవరం అంటేథ్కర్ విగ్రహం సెంటర్ నుండి ప్రకాశం చౌక్ మీదుగా ర్యాలి నిర్వహించడం జరిగింది. దేశంలోనే మలేరియా రహిత జిల్లాగా పశ్చిమ గోదావరి జిల్లా భాసిల్లాలని దానికి కృషి చేస్తామని ప్రమాణం చేసారు.. ఈ కార్యక్రమమునకు భీమవరం పట్టణ పరిధిలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లలోని వైద్య అధికారులు మరియు ఆరోగ్య శాఖసిబ్బంది మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మలేరియా సిబ్బంది. జిల్లా ఉప మలేరియా అధికారి పి నాగబాబు,, అరమిల్లి వీర వేంకట సత్యనారాయణ మూర్తి ఎ.ఎన్.ఎంలు, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.
