సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్:కలియుగ వైకుంఠం తిరుమల లో TTD కొలువుల కోసం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మే 10, 11 తేదీలలో ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఈ పరీక్షల ద్వారా ఏఈఈ (సివిల్), ఏఈఈ (ఎలక్ట్రికల్), ఏఈ (సివిల్), ఏటీవో (సివిల్) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేశారు.పరీక్షల షెడ్యూల్ ఇలా ఉంది. 10.05.2026 – ఉదయం 9.00 నుంచి మధ్యాహ్నం 12.00 వరకు – AEE (సివిల్) పరీక్ష నిర్వహిస్తారు. 10.05.2026 – మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 5.00 వరకు – AEE (ఎలక్ట్రికల్) పరీక్ష ఉంటుంది. 11.05.2026 – ఉదయం 9.00 నుంచి మధ్యాహ్నం 12.00 వరకు – AE (సివిల్) పరీక్ష నిర్వహించనున్నారు. 11.05.2026 – మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 5.00 వరకు – ATO (సివిల్) పరీక్ష ఉంటుంది. పరీక్షా కేంద్రాల వంటి వివరాలను అభ్యర్థులు కాల్ సెంటర్ నెంబర్ 155257ను సంప్రదించాలి. అంతేకాదు టీటీడీ అధికారిక వెబ్ సైట్ అయిన https://ttdrecruitment.aptonline.inను సంప్రదించాలని సూచిస్తోంది
