సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం వెలువడుతున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో 3 రాష్ట్రాలు బీజేపీ ఘన విజయం సాధించిన దృష్ట్యా దేశవ్యాప్తంగా కమల దళాలు పండుగ చేసుకొంటున్నాయి. ఈ నేపాఢ్యములోకేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ విజయవాడ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో , నేటి సాయంత్రం భీమవరం జిల్లా కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలకు స్వీట్లు తినిపించి సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరంవర్మ మాట్లాడుతూ.. అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోగా.. తొలిసారిగా పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం సాధించడం చరిత్రాత్మకమన్నారు. అక్కడ గతంలో కమ్యూనిస్టుల పాలనలో బీజేపీ నేతలపై దాడులు జరిగాయని విమర్శించారు. 2011లో ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా.. 2021లో 70 స్థానాల్లో బీజేపీ విజయం సాధించిందని కేంద్ర మంత్రి గుర్తుచేశారు. ఇప్పుడు దాదాపు రెండు వందల స్థానాల్లో బీజేపీ విజయం దిశగా దూసుకెళ్తోందన్నారు. బెంగాల్లో మమతా బెనర్జీ.. అరాచకాలు చేసారని తన అధికారం కోసం, దేశ విధ్వంసకర ధోరణికి పాల్పడ్డారని, బంగ్లాదేశ్ చొరబాటుదారుల ను ప్రోత్సహిస్తూ ఇప్పటి వరకు మమత గెలుస్తూ వచ్చారని అన్నారు. వీటిని అధిగమించి శతాబ్దాలుగా అక్కడ బీజేపీ కార్యకర్తలు చేసిన త్యాగాలు, కృషికి ఇప్పుడు బెంగాల్ ప్రజలు బీజేపీపై నమ్మకంతో దాదాపు 200 స్థానాల్లో విజయం కట్టబెట్టారన్నారు.శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సొంత రాష్ట్రం వెస్ట్ బెంగాల్లో బీజేపీ జెండా రెపరెపలాటడటం ఆనందంగా ఉందన్నారు. తాను ప్రచారంలో పాల్గొన్న కేరళలో బీజేపీ ఓటింగ్ శాతం పెరిగిందని,తొలిసారి బీజేపీ రెండు స్థానాలతో అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతోందన్నారు. తమిళనాడులో స్టాలిన్ పార్టీ కూడా ఓటమి దిశగా పయనిస్తోందన్నారు. పార్లమెంట్ లో మహిళా బిల్లును వ్యతిరేకించిన వారికి ప్రజలు బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు.
