సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తమిళనాడు రాజకీయాలు ఊహించని మలుపు తిరుగుతున్నాయి. తమిళనాడులో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి రేపు గురువారం ముహూర్తంగా టీవీకే అధినేత విజయ్ సన్నాహాలు ప్రారంభించారు. ఈమేరకు తమిళనాడు గవర్నర్ ఆర్లేకర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు విజయ్. అయితే గవర్నర్ నుంచి ప్రభుత్వ ఏర్పాటుకు ఊహించని విధంగా అనుమతి లభించలేదు. మెజారిటీపై గవర్నర్‌ను ఒప్పించలేకపోయారు. విజయ్‌కు 113 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అయితే 118 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి.అయితే, కాంగ్రెస్ మద్దతు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి విజయ్ టీవీకేకు ఇంకా తగినంత సంఖ్యాబలం లేదు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌కు సిద్ధం అయ్యే వరకు సీఎంగా స్టాలిన్ కొనసాగుతారని గవర్నర్ పేర్కొన్నట్లు సమాచారం. ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన ఆయన పార్టీ, తమిళగ వెట్రి కజగం (టీవీకే), 118 సీట్ల మెజారిటీ మార్కును చేరుకోవడానికి కనీసం 10 సీట్లు అవసరం.. కాంగ్రెస్ ఐదు సీట్లతో, ఆ సంఖ్య 113కి పెరిగింది.. ఇతర కీలక డీఎంకే మిత్రపక్షాలైన సీపీఐ (రెండు సీట్లు), సీపీఎం (రెండు సీట్లు), వీసీకే (రెండు సీట్లు)ల మద్దతుపైనే టీవీకే ఆశలు పెట్టుకుంది. ఈ క్రమంలో లెఫ్ట్ పార్టీలు తాము విజయ్ కి మద్దతు ఇవ్వలేమని ప్రకటించారు. అయితే బీజేపీ కి ఒక్క స్తానం మాత్రమే రావడంతో ఎన్డీయే లోని మాజీ సీఎం పళని స్వామి ఆద్వర్యంలోని అన్నాడీఎంకే తన మొత్తం 47 మంది ఎమ్మెల్యేల తో విజయ్ కి మద్దతు తెలిపే యోచనలో సంప్రదింపులు చేస్తున్నారు. ఇది జరిగితే పెద్ద సంచలనమే..
