సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విప్లవాగ్ని.. అల్లూరి సీతారామ రాజు 102 వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. భీమవరం తాలూకా మోగల్లు గ్రామంలో జన్మించిన అల్లూరి సీతారామ రాజు ఖ్యాతి దేశం యావత్తు పాకింది. శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు నేటి ఉదయం .భీమవరం ఏ ఎస్ ఆర్ నగర్ లోని దేశ ఖ్యాతి గాంచిన 35 అడుగుల అల్లూరి సీతారామ రాజు కాంస్య విగ్రహం వద్ద ఘన నివాళ్లు అర్పించారు. ‘నా దేశం, నా ప్రజలు పరాయి పాలనలో ఉండటం సిగ్గు చేటని,భావించి విల్లంబులతో ప్రజలలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన అల్లూరి చిరస్మరణీయుడని’ అన్నారు. చిన్నారులు ప్రముఖ దేశభక్తుల వేషధారణలో అలరించారు. భీమవరంలో పలు ప్రాంతాలలో అల్లూరి విగ్రహాలకు ఎం ముఖ్యంగా ప్రకాశం చౌక్ లోను, ఇక్కడికి సమీపంలోని అల్లూరి .. స్వగ్రామం మోగల్లులోను పలుచోట్ల అల్లూరి.. విగ్రహాలకు పుష్ప మాలలు వేసి స్థానికులు, ప్రముఖులు ఘన నివాళ్లు అర్పించారు. దీనిలో భాగంగా నరసయ్య అగ్రహారంలోని అల్లూరి విగ్రహం వద్ద అల్లూరి సీతారామరాజు యువజన సంఘం, జిల్లా సిపిఐ పార్టీ మరియు ప్రజా నాట్యమండలి అధ్వర్యంలో అల్లూరి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. భీమవరం పురపాలక సంఘంలో మున్సిపల్ కమిషనర్ కె. రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో మరియు సిబ్బంది అల్లూరి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగినది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *