సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్: పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎన్నికలలో చరిత్రాత్మక విజయం సాధించిన బీజేపీ తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. కొంత సస్పెన్సు నడిచినప్పటికీ చివరికిఅందరూ ఊహించినట్లుగానే ‘సువేందు అధికారి’నే హైకమాండ్ సీఎంగా తాజగా నేడు, శుక్రవారం అధిష్టానం ఎంపిక చేసింది.బీజేపీ శాశసనసభ పక్షంలో సువేందు అధికారిపేరును తాజాగా అధికారికంగా సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. గతంలో మమతా బెనర్జీ ఆధ్వర్యంలో టీఎంసీ పార్టీలో కీలక నేతగా ఉన్న సువేందు అధికారి పలు పదవులు నిర్వహించారు. శారదా గ్రూప్ పొంజీ స్కామ్ లో ఈయనకు ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అయితే, ఆ తర్వాత ఆయన ‘మమతా’ హిందూ వ్యతిరేక విధానాలకు పాల్బడుతున్నారంటూ బీజేపీలో చేరిపోయి తన గురువు మాజీ సీఎం మమతా బెనర్జీని సువేందు అధికారి వరుసగా రెండుసార్లు ఓడించిన సంగతి తెలిసిందే. దీంతో బీజేపీలో బలమైన నేతగా ఎదిగిన సువేందుకే సీఎం పదవి కట్టబెట్టింది. ఆయన ప్రమాణ స్వీకారానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
