సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి సొసైటీ కమిటీ నూతన డైరెక్టర్లుగా నియమితులైన యర్రంశెట్టి శివకృష్ణ, ప్రముఖ గో సంరక్షకుడు సుంకర దాసు లు నేడు శుక్రవారం ఎమ్మెల్యే అంజిబాబును మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి ఆసుపత్రికి అభివృద్ధి శక్తివంతనతో కృషి చేయాలన్నారు. ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, మౌలిక సదుపాయాల అభివృద్ధి కమిటీ బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. అనంతరం వారిని అభినందించి సత్కరించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా .టీడీపీ నేత మాజీ కౌన్సిలర్ ఐజాక్ బాబు ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి సొసైటీ కమిటీ డైరెక్టర్లుగా నియమితులైన నేపథ్యంలో టీడీపీ నేతలలో హర్షం వ్యక్తం అవుతుంది
