సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో మహిళల పై అత్యాచార కేసులు విపరీతంగా పెరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. బాలికలపై ఆచ్యచారాలు బాగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం కాళ్లచెరువు గ్రామంలో బాలికపై, స్థానిక చర్చి పాస్టర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన సంచలనం రేపింది. దీనిని కేంద్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తీవ్రంగా పరిగణించింది. నిందితుడు చౌటపల్లి రాంబాబు(42)పై సుమోటోగా కేసు నమోదు చేసినట్లు రాష్ట్రకమిషన్ చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణరాజు తెలిపారు. రేపు సోమవారం కళ్లచెరువు గ్రామానికి వెళ్లి బాధిత బాలికను, ఆమె కుటుంబాన్ని పరామర్శించనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. బాలిక ఆరోగ్య పరిస్థితి, పోలీసుల కేసు దర్యాప్తు పురోగతిపైవివరణ కోరానని అన్నారు.
