సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: రష్యా, ఇరాన్ ఫై అమెరికా ఆంక్షలు .లెక్క చెయ్యకుండా భారీగా లాభ పడిన దేశం దేశం చైనా..ఇన్నాళ్లు శత్రుదేశాలగా తీవ్ర విమర్శలు చేసుకొన్నా ..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధినేత జిన్‌పింగ్ మధ్య నేడు గురువారం బీజింగ్‌లో ఉన్నత స్థాయి సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఇరు దేశాల బృందాలను ఉద్దేశించి మాట్లాడిన అధ్యక్షుడు ట్రంప్.. చైనా అధినేత జిన్‌పింగ్ ను కలవడం తనకు ఎంతో గౌరవమని, ఆయన తనకు మంచి స్నేహితుడని కొనియాడారు. ఇరు దేశాలకు అద్భుతమైన భవిష్యత్తు ఉందని వ్యాఖ్యానించారు. మా మధ్య. పొరపొచ్చాలు వచ్చినప్పుడు కూడా మాట్లాడుకుని త్వరగా శాంతిగా పరిష్కరించాము. మీరు ఒక గొప్ప నాయకుడు. ఇలా నేను మిమ్మల్ని ప్రశంసించడం కొందరికి నచ్చకపోవచ్చు. కానీ నేను ఉన్నది ఉన్నట్టు చెబుతున్నాను. చైనా, అమెరికాలు కలిసికట్టుగా అధ్బుత భవిష్యత్తువైపు అడుగులు వేస్తున్నాయి ’ అని ట్రంప్ అన్నారు
