సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో శుభ కార్యక్రమాలు వివాహ వేడుకలు మంగళవాయిద్యాలు కు పెద్ద విరామం వచ్చేసింది. దేశ ప్రజలు ఇక ఆడంబరాలు కు దూరంగా ఉండండి.. భారీ వేడుకలు వాయిదా వెయ్యండి.. బంగారం కొనవద్దు..పొదుపు పాటించండి అంటూ.. ప్రధాని మోడీ అని పిలుపు నివ్వడం వల్ల మాత్రం కాదు. గత ఫిబ్రవరి నుంచి మే 14 వరకూ శుభకార్యాలతో కళకళలాడించిన ముహూర్తాలు నెల రోజల పైబడి సెలవు తీసుకుంటున్నాయి. వచ్చే ఆదివారం నుంచి అధికజ్యేష్ట మాసం రానుండడంతో జూన్ 20 వరకూమంచి ముహర్తలు లేవని పండితులు చెపుతున్నారు. జూన్‌లో చివరి 8 రోజులు మంచి ముహూర్తాలున్నాయని పండితులు వివరిస్తున్నారు. జూలైలో మరో నాలుగు రోజులు మాత్రమే ముహూర్తాలున్నాయినిఆ తరువాత చతుర్మాసం తదితర కారణాలతో ఆగస్టులో 11 రోజులు, సెప్టెంబరులో 4, అక్టోబరులో మరో 4 రోజులు మాత్రం ముహూర్తాలున్నా చతుర్మాసం అడ్డొస్తోందని పురోహితులు అంటున్నారు. ఆ తరువాత నవంబరులో కార్తీక మాసం కారణంగా 11 రోజులు,డిసెంబరులో మరో 14 రోజుల్లో కూడా మంచి ముహూర్తాలున్నాయని పండిత సమాచారం..
