సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా వాహనదారులపై లీటర్ కు 3 రూపాయలు పైగా పడగా ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు CNG ఫ్యూయల్ తో నడిచే వాహనాలకు కేంద్ర ప్రభుత్వం దేశీయంగా సీఎన్‌జీ (CNG) ధరలను మరోసారి పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో పెను భారం పడినట్లైంది. తాజాగా, నేడు ఆదివారం నుండి కేజీ సీఎన్‌జీపై ఒక రూపాయి చొప్పున ధరను పెంచారు. ఈ పెంపుతో అటు సొంత వాహనదారులు, ఇటు ఆటో, క్యాబ్ డ్రైవర్ల బడ్జెట్ తలకిందులైంది. గడిచిన 48 గంటల్లోనే సీఎన్‌జీ ధరలు పెరగడం ఇది రెండోసారి. అంతకు ముందు మే 15వ తేదీన చమురు కంపెనీలు సీఎన్‌జీ ధర కిలో రూ.2 మేర పెంచాయి. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే సీఎన్‌జీ వాహనదారులపై మొత్తంగా మూడు రూపాయల అదనపు భారం పడినట్లయింది. తాజా పెంపుతో రాజధాని ఢిల్లీలో సీఎన్‌జీ ధర కేజీ రూ.80.09కి చేరింది.. హైదరాబాద్‌లో అత్యధికంగా రూ.100కు చేరింది.హర్ముజ్ జల సంధి ప్రస్తుతం అమెరికా, ఇరాన్ పోటాపోటీ దిగ్బంధనాలలో ఉన్నాయి ఇదే పరిస్థితి కొనసాగితే మరో 10 రోజులలో భారత్ లో పెట్రోల్ ధర మరింత పెరిగే అవకాశలు స్వష్టంగా ఉన్నాయి.
