సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్; ఇటీవల దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. నిజానికి గత ఏడాది కూడా ఇదే తీరున నీట్ కూడా లీక్ అయ్యిందని ? దర్యాప్తులో అనధికార సమాచారం అందటంతో అసలు ఈ దేశంలో ఏమి జరుగుతుంది? అని వైద్య విద్యార్థుల తల్లి తండ్రులలో ఆందోళన వ్యక్తం అవుతుంది. నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం పేపర్ లీక్ ఘటనపై లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీపై పలు ఆరోపణలు చేసారు. తాజాగా నేడు, ఆదివారం ప్రధాని మోదీకి మరోసారి పలు ప్రశ్నలు సంధిస్తూ ఎక్స్ వేదికగా సూటిగా ప్రశ్నించారు. మోదీ గారూ.. దేశం మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతోంది. వాటికి సమాధానం చెప్పండి. నీట్ 2024 పేపర్ లీక్ అయింది.ఎందరో విద్యార్థుల భవిషత్తు నాశనం అయ్యింది. అయినా పరీక్ష రద్దు కాలేదు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయలేదు. సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.తాజా ఘటనపై నిజానిజాలు తేల్చేందుకు కేంద్రం కమిటీని కూడా ఏర్పాటు చేశారు. మోదీ గారూ.. పేపర్ లీక్ ఘటనలు పదేపదే ఎందుకు జరుగుతున్నాయి?. ఈ పరీక్షా పత్రాల లీక్పై మీరు ఎప్పుడూ ఎందుకు మౌనం వహిస్తున్నారు? పదేపదే విఫలమవుతున్న విద్యాశాఖ మంత్రిని ఎందుకు తొలగించడం లేదు?‘ అంటూ ప్రశ్నించారు.
