సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, హర్మూజ్ జలసంది మూతబడడంతో దానిని ఓపెన్ చేయించలేకపోయిన అమెరికా ఫై భారత్ తన వత్తిడి పెంచడం తో ఎట్టకేలకు రష్యా నుండి చమురు కొనుగోలుకు భారత్ కు మరో 30 రోజులు అనుమతి పొడిగించింది. ఇప్పటికే రష్యా నుండి భారత్ బయలుదేరి సముద్రం మధ్యలో నిలిచిపోయిన రష్యన్ చమురు నౌకలపై ఉన్న ఆంక్షల మినహాయింపును మరో 30 రోజులు పొడిగిస్తున్నట్లు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ తాజగా ప్రకటించారు. ఈ తాత్కాలిక పొడగింపుతో రష్యా ఇంధన సంస్థలపై అమెరికా విధించిన ఆంక్షలను ఉల్లంఘించకుండానే.. ట్యాంకర్లలో నిలిచిపోయిన రష్యా చమురు, పెట్రోలియం ఉత్పత్తులను తాత్కాలికంగా పొందేందుకు భారత్ కు వీలు కలుగుతుంది. దీనితో భారత్ దేశ వ్యాప్తంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్న మోడీ సర్కార్ కు కాస్త ఉపశమనం,భారత్ లో వాహన దారులకు భారీ ఊరట లభిస్తుంది.
