సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మెగాస్టార్‌ చిరంజీవి ఈ ఏడాది ప్రారంభంలో విక్టరీ వెంకటేష్ తో కలసిమన శంకర వర్రపసాద్‌గారు’ చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకున్నారు. సుదీర్ఘ కాలంగా షూటింగ్ జరుగుతున్నా ‘విశ్వంభర’ పూర్తి చేశారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇక శ్రీకాంత్‌ ఓదెలతో ఓ సినిమా కమిట్‌ అయ్యారు. గతంలో ‘వాల్తేరు వీరయ్య’తో సంక్రాంతికి పెద్ద హిట్‌ ఇచ్చిన బాబీ కొల్లితో ‘మెగా158’ (Mega 158) చిత్రం షూటింగ్ నేడు, గురువారం పార్రంభమయ్యింది. . ఈ చిత్రంతో కెవిఎన్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ టాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. హైదరాబాద్‌, అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ వేడుకకు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, కె.నాగబాబు, అల్లు అరవింద్‌, బి.గోపాల్‌, కె.ఎల్‌.నారాయణ, అశ్వినీదత్‌, కోదండ రామిరెడ్డి, కె.ఎస్‌.రామారావు సహా పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. గ్యాంగ్‌స్టర్‌ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ప్రేక్షకుల్ని అలరించింది. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *