సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు, గురువారం జరగనున్న కేంద్ర మంత్రివర్గ సమావేశంపై దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇది పైకి సాధారణ రివ్యూ మీటింగ్‌లా కనిపిస్తున్నప్పటికీ.. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల కేంద్ర మంత్రులపై కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది.మంత్రుల పనితీరు, ప్రవర్తన, వివాద రహిత ఇమేజ్ లాంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుని కొందరిపై వేటు వేసేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే 20 మందికి పైగా మంత్రులకు ఇదే చివరి మీటింగ్‌? కావచ్చని రాజకీయ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. ( బండి సంజయ్ ?నిర్మల సీతారామన్?)మోదీ సర్కార్ 30 మంది క్యాబినెట్ మంత్రులు, 36 మంది సహాయ మంత్రులు, స్వతంత్ర హోదా కలిగిన అయిదుగురు మంత్రులతో కలిపి మొత్తం 72 మంది సభ్యులు ఈ ఏడాది మొదటిసారి ఒకే చోట సమావేశం కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన విజయాలు, అలాగే పుదుచ్చేరిలో NDA కూటమి తిరిగి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో.. కొత్త ముఖాలకు మంత్రివర్గంలో చోటు కల్పించే దిశగా ప్రధాని మోదీ ఈ అడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *