సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి, మంగళవారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏమైనా మీ అయ్యా జాగీరా? “నా ఇంటి అడ్రస్ ఇదే.. చేతనైతే రండి, దాడి చేయండి చూద్దాం.అని సవాల్ విసిరారు. ఇంతలోనే... తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుందని తనకు అధికారం కావాలని లేదని.. ముఖ్యమంత్రి కావాలనే ఆశే లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనే దిక్కులేదు.. తెలంగాణలో ముఖ్యమంత్రి అవుతానా? అంటూ పవన్ కళ్యాణ్ విచిత్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఈసారి ఎన్నికలలో తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. నిజానికి రాష్ట్ర విభజన ఉద్యమంలో తెలంగాణను వ్యతిరేకించిన వారే..కీలక పదవుల్లో ఉన్నారని.. ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ అంటే గౌరవం ఉంది కనుకే కొండగట్టు ఆలయానికి కోట్ల రూపాయిలు విరాళంగా ఇచ్చామన్నారు. తెలంగాణ వాదుల పేరుతొ నన్ను బెదిరిస్తున్న వారి తాటాకు చప్పుళ్లకు పవన్ కళ్యాణ్ కానీ జనసేన పార్టీ భయపడదన్నారు. తెలంగాణను తానెప్పుడు అవమానించాను? అని ఆయన స్థానిక నేతలను ప్రశ్నించారు. తన పీక కోసినా కూడా భయపడేది లేదన్నారు. తనకు ఎవరిని రెచ్చగొట్టడం ఇష్టం లేదని తెలిపారు. తనను ఎన్ని తిట్టినా పట్టించు కోనన్నారు.. తెలంగాణలో ఉపాధి లేకపోతే తాను కారణమా? ఇంకెంతకాలం ఆంధ్రావాళ్లను తిడుతూ కాలక్షేపం చేస్తారంటూ తెలంగాణలోని నాయకులను ప్రశ్నించారు.
