సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హమ్మయ్య! మండు వేసవికి వీడ్కోలు పలకడానికి నైరుతి రుతుపవనాలు రేపు గురువారం కేరళలోకి కచ్చితంగా ప్రవేశించనున్నాయి. అదే రోజు తమిళనాడు, లక్షద్వీ్‌పలో పలు ప్రాంతాలు, అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలకూ విస్తరించనున్నాయి. ఈమేరకు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ప్రకటించింది. కేరళ, లక్ష ద్వీ్‌పలలో గడిచిన రెండు, మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటం, కేరళకు ఆనుకుని అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఆవరించడంతో రుతుపవనాల రాకకు అనుకూలంగా ఉందని తెలిపింది. వచ్చే ఏడు రోజుల్లో కేరళలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, 7 నుంచి 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశముందని హెచ్చరించింది. అలాగే, వచ్చే వారం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ లో దక్షిణాది రాష్ట్రాల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలుగు రాష్ట్రాలలో ఇకపై గరిష్ఠ ఉష్ణోగ్రతలు రానున్న నాలుగు రోజుల్లో క్రమంగా 2 నుంచి 4 డిగ్రీల మేరకు తగ్గే అవకాశముందని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *