సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: స్టార్ మా ఛానెల్ ద్వారా తెలుగు బుల్లితెర చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ (Bigg Boss Telugu 10) . ఇప్పటికే తొమ్మిది సీజన్లను పూర్తి చేసుకుని, ఎన్ని వివాదాలు ఉన్న కోట్లాది మంది ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన ఈ సూపర్ హిట్ షో.. ఇప్పుడు ల్యాండ్‌మార్క్ పదో సీజన్‌తో అలరించేందుకు సిద్ధమైంది. నేడు ఆదివారం (జూన్ 7న) బిగ్‌బాస్ మేకర్స్ సరికొత్త సీజన్‌కు సంబంధించిన అధికారిక గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తూ ఈ గుడ్‌న్యూస్ చెప్పడంతో బిగ్‌బాస్ సందడి మొదలైపోయింది., గత సీజన్ మాదిరి ఈసారి కూడా సామాన్యులకు గోల్డెన్ ఛాన్స్ ఇస్తారా? లేక కేవలం సెలబ్రిటీలకే పరిమితం చేస్తారా? అనే తీవ్ర ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. ఈసారి వయస్సు తో సంబంధం లేని ‘మన్మధుడు’ నాగార్జున హోస్టింగ్ స్టైల్, సరికొత్త గృహ నిర్మాణం (హౌస్ సెట్), వింత సవాళ్లు ఈ సీజన్‌లో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని మరింత భారీగా అందిస్తాయని వినోద ప్రియులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *