సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగువారికి సుపరిచితమైన తమిళ సీనియర్ స్టార్ డైరెక్టర్, యాక్టర్ భారతీరాజా (84) ఇక లేరు. తెలుగు, తమిళ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసిన ఆయన నేడు, బుధవారం (జూన్ 10) తెల్లవారుజామున కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో పాటు గత ఏడాది భారతీరాజా ఏకైక కుమారుడు మనోజ్ భారతీరాజా (48) అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం ఆయనను బాగా కృంగదీసింది.దీంతో తెలుగు, తమిళ సినీ ప్రముఖులు, డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు ఈ లెజెండరీ డైరెక్టర్ కు నివాళులు అర్పిస్తున్నారు. తమిళ్ లో లెక్కలెన్నని హిట్ ఉన్నపటికీ.. తెలుగులో సీతాకోక చిలుక, సూపర్ స్టార్ కృష్ణ తో జమదగ్ని, చిరంజీవి తో ఆరాధన వంటి మ్యూజికల్ హిట్ సినిమాలుకు భారతీరాజా దర్శకుడీగా పనిచేసారు. ఈ సినిమాలు ఇప్పుడు చుసిన ఆధునిక భావాలతో సరికొత్త గా ఉంటాయి. ‘యువ ‘సినిమాలో విలన్ గా అందరికి గుర్తుండిపోతారు.
