సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో కూటమి పాలన అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తీ అయిన నేపథ్యంలో ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 2ఏళ్ళ ;వెన్నుపోటు దినోత్సవం నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చిన నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు నిరసన ప్రదర్సనలు చేసారు, ముఖ్యంగా భీమవరం నియోజక వైసీపీ పార్టీ ఇంచార్జి చినమిల్లి వెంకట రాయుడు , భీమవరం మండల ఎంపీపీ పేరిచర్ల నరసింహ రాజు ఆధ్వర్యంలో భీమవరం పట్టణ విధుల మీదుగా వైసీపీ శ్రేణులు సీఎం చంద్రబాబు వెన్నుపోటు ప్లై కార్డ్స్ చేతబూని రోడ్లపై నినాదాలు తో పాటు చొక్కాలు విప్పి నేలపై బెటాయించి అర్ధనగ్న ప్రదర్సన చేసారు. అలాగే భీమవరం కు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాలకొల్లు లో వైసీపీ శ్రేణులు భారీ స్థాయిలో బైక్ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ నేతలు మాట్లాడుతూ.. కూటమి పాలన ను విమర్శలు చేస్తూ .. 2 ఏళ్లుగా రాష్ట్ర ప్రజలు ఎన్నో కష్టాలు ఎదురుకొంటున్నారని, కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని నిత్యావసర వస్తువుల ధరలు అడ్డు అదుపు పెరిగిపోయాయని, అమరావతి రాజధాని పేరుతొ రాష్ట్రాన్ని అప్ప్పుల పాలు చేసి దొరికినకాడికి వేల కోట్లు దోచేస్తున్నారని, అక్కడి రైతులకు వెన్నుపోటు పొడిచారని, రాష్ట్రంలో ప్రజా సంక్షేమం లేదని సూపర్ సిక్స్ అని ప్రజలను వెన్ను పోటు పొడిచారని, డీఎస్సీ అంటూ చదువుకున్న యువతకు వెన్ను పోటు పొడిచారణై ..గత జగన్ హయాంలో ఉన్న అన్ని సంక్షేమ పథకాలు కూడా తీసిపారేశారని, విద్య వైద్యం సామాన్య ప్రజలకు దూరం చేసారని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *