సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లాంచీలా రేవు వద్ద నేడు, శనివారం యనమదుర్రు కాలువలో కిక్కిస గుర్రపు డెక్క తొలగింపు పనులను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. యన్మదురు కాలువలో ఏకంగా 32 కిలోమీటర్లు సుమారు రూ కోటి 50 లక్షలతో కిక్కిస తొలగింపు పనులను చేపడుతున్నారని, ఈ పనుల ద్వారా నీటి పారుదల మెరుగుపడి రైతులు నీటి ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందుతారన్నారు. యనమదుర్రు డ్రెయిన్‌ ఇరు పక్కల దట్టంగా ఉన్న కిక్కిసను తొలగించి కాలువ వెడల్పు ను విస్తరించటం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు నేడు, శనివారం .భీమవరం మండలం నరసింహపురం పంచాయతీ కార్యాలయం వద్ద పారిశుధ్య నూతన వాహనాన్ని నేడు, శనివారం ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *