సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో నేడు, శనివారం పర్యటిస్తున్న ఏపీ బీజేపీ మాజీ అడ్జక్షుడు, ప్రస్తుత ఎమ్మెల్సీ సోము వీర్రాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీలో ముఖ్యంగా ఈ గోదావరి జిల్లాలలో ఆక్వా రైతులు కష్టాలు ఎదురుకొంటున్నా విషయం వాస్తవమేనని, నాకున్న సమాచారం ప్రకారం ఆక్వా వ్యాపారంలో కొనుగోళ్లు ఎగుమతులు,హేచరీలు మెతలు అమ్మకాలలో కూడా తమ ప్రాధాన్యం ఉన్న ‘5 గురు వ్యక్తుల వల్ల రాష్ట్రంలో 4 లక్షల మంది ఆక్వా రైతులు ఇబ్బందులు’ పడుతున్నారని సంచలన ఆరోపణలు చేసారు. ఇక్కడి ఆక్వా రైతుల సమస్యలపై పరిష్కారానికి బీజేపీ కృషి చేస్తుందని, అందుకే ఈ ప్రాంత రాజ్యసభ సభ్యుడు పాక సత్యనారాయణ పెద్దల సభలో ఆక్వా సమస్యల ఫై మాట్లాడి కేంద్రం దృష్టికి తీసుకొనివెళ్ళారని సోము వీర్రాజు ప్రకటించారు. నిజానికి దక్షిణ భారతం లో ఆక్వా సామ్రాజాన్ని ఏలుతున్న వారిలో భీమవరం ప్రాంత ప్రముఖులే ఎక్కువగా ఉన్నారని ప్రతీతి.. వారు కూడా కూటమి లో కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి ఎవరిని ఉద్దేశించి ‘సోము’ వీర్రాజు ఈ వ్యాక్యలు చేశారు? ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా మెతలు ధరలు పెంచవద్దని ఉన్నవి తగ్గించమని ఆదేశాలు ఇస్తున్న తాజగా మరోసారి ధరలు పెంచారని (వనామీ రకం రొయ్య మేతపై కిలోకు రూ.10, టైగర్ రొయ్య మేతపై కిలోకు రూ.12 పెంపు..?) ఆక్వా రైతులు వాపోతున్నారు. స్థానిక ఆక్వా రైతు సంఘాలు నేతలు తమ సమస్యలను సోము దృష్టికి తెచ్చారు. భీమవరానికి చెందిన జేష్ఠ స్వయంసేవక్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్త, కరసేవకుడు గంటా రాజన్న ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో ఆయన నివాసానికి వెళ్లి సోము వీర్రాజు సంతాపం తెలిపారు.
