సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: గల్ఫ్ లో యుద్దాలు ముగియడంతో నేడు, సోమవారం దేశీయ సూచీలు లాభాలు ఆర్జించాయి. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడాయిల్ ధర దిగివచ్చింది. ఏకంగా 4.55 శాతం తగ్గి 83.36 డాలర్లకు చేరుకుంది. మరోవైపు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ (94.74) బలపడింది.నేటి ఉదయం భారీ లాభాల్లో కదలాడిన సూచీలు షేర్స్ అమ్మకాలు ఎక్కువ కావడంతో మధ్యాహ్నం తర్వాత కాస్త కిందకు దిగి వచ్చాయి. మొత్తానికి లాభాలతోనే రోజును ముగించాయి (Indian stock market).గత సెషన్ ముగింపు (75,527)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం 1100 పాయింట్లకు పైగా లాభంతో మొదలైన సెన్సెక్స్ చివరకు 736 పాయింట్ల లాభంతో 76,264 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా చివరకు 231 పాయింట్ల లాభంతో 23,853 వద్ద స్థిరపడింది (stock market news today).. బ్యాంక్ నిఫ్టీ 384 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 781 పాయింట్లు ఆర్జించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *