సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) పరిధిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 529 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ వైద్య సేవల నియామక బోర్డు (APMSRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాల్లో స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు, మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్ల పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 30, 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చుఖాళీల వివరాలు,స్టాఫ్ నర్స్ – 419 పోస్టులు, ఫార్మసిస్ట్ – 24 పోస్టులు, మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్ (NPHCE) – 86 పోస్టులు తో కలపి మొత్తం పోస్టులు: 529 ఉన్నాయి. 2026 జనవరి 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. వేతనాలు స్టాఫ్ నర్స్ – నెలకు రూ.27,675, ఫార్మసిస్ట్ – నెలకు రూ.23,393. మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్ – నెలకు రూ.23,494 ఉంటాయి. ఈ నియామకాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు. అభ్యర్థుల విద్యార్హతల్లో సాధించిన మార్కులు, మెరిట్, రిజర్వేషన్ నిబంధనల ఆధారంగా ఎంపిక చేపడతారు. దరఖాస్తు ఫీజు, ఓసీ అభ్యర్థులు – రూ.1,200, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు – రూ.900 కట్టాలి.
