సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశీయ స్టాక్ మార్కెట్ లో వరుసగా మూడో రోజు కూడా దేశీయ సూచీలు లాభాలతోనే ముగిశాయి. క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం, మరోవైపు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి (94.53) బలపడడం దేశీయ సూచీలకు మేలు చేసింది. .గత సెషన్ ముగింపు (76,808)తో పోల్చుకుంటే నేడు బుధవారం ఉదయం దాదాపు 200 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ చివరకు 347 పాయింట్ల లాభంతో 77,155 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 96 పాయింట్ల లాభంతో 24,085 వద్ద ఆగింది. బ్యాంక్ నిఫ్టీ 187 పాయింట్ల లాభపడింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 321 పాయింట్లు సాధించింది.(stok market)
