సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని నేడు, బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత మేకప్ ను ఉద్దేశించి వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను సమర్ధించారు. అనిత ముందు మాజీ మంత్రిని పట్టుకొని వాడు వీడు. ఆ డెవడో అన్నాడు.. అంటూ చేసిన వ్యాక్యలు మీడియాకు చూపించి ఇలా మాట్లాడొచ్చా? గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి అన్నారు. ఈ క్రమంలోనే గతంలో పవన్ కళ్యాణ్ రోజా గురించి చేసిన డైమండ్ రాణి వ్యాఖ్యలను తెరపైకి తెచ్చారు. ఆ వీడియోను చూపిస్తూ విమర్శలు గుప్పించారు. ఇప్పటికిప్పుడు సంస్కారానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారినట్లు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని .. గతంలో వైసీపీ మంత్రులను నా కొడకల్లారా అనే పవన్ కళ్యాణ్‌కు కొత్తగా మంత్రి పదవితో పాటుగా సంస్కారం కూడా వచ్చిందా? అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జనసైనికుల బాధలు కనబడవు, వారిపై దాడులు కనపడవు. ఏపీ పోలీసుల తీరు దారుణంగా ఉందన్న పేర్ని నాని.. విజయవాడలో శాంతిభద్రతలను గాలికొదిలేశారని . కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని జనసేన పార్టీకి చెందిన గాదె సాయికృష్ణ ను పోలీసులు అరెస్ట్ చేసి చిత్ర హింసలు పాలు చేసి లాకప్ డెత్? చేస్తే దిక్కు లేదని అన్నారు. ఆ కేసును సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించాలని పేర్ని నాని డిమాండ్ చేశారు.
